Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మీ ఇల్లు కూడా లగ్జరీ రిసార్ట్‌లా పరిమళాలు వెదజల్లాలా? ఈ టిప్స్ మీకోసమే!

Tips to make your home smell like a luxury resort
Advertisement
  • ఇంటికి ఓ ప్రత్యేక సువాసనను ఎంచుకోవాలి
  • గదుల వినియోగాన్ని బట్టి వేర్వేరు సువాసనలు వాడాలి
  • సువాసన ఘాటుగా కాకుండా, సున్నితంగా వ్యాపించాలి
  • వాతావరణాన్ని బట్టి సువాసనలు మార్చడం మేలు
  • సువాసనను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి
Advertisement
ఓ లగ్జరీ రిసార్ట్‌లోకి అడుగుపెట్టగానే మనసు ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా మారుతుంది. దీనికి ప్రధాన కారణం అక్కడి వాతావరణంలో భాగమైన ప్రత్యేకమైన సువాసన. అలాంటి అనుభూతిని మన ఇంట్లో కూడా పొందవచ్చని, అందుకు కొన్ని సులువైన చిట్కాలు పాటిస్తే చాలని అంటున్నారు ఫ్రేగ్రెన్స్ నిపుణుడు, ఐరిస్ హోమ్ ఫ్రేగ్రెన్సెస్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ వి. రంగ. ఆయన సూచనల ప్రకారం, సువాసనలు మన మూడ్‌ను, జ్ఞాపకాలను ప్రభావితం చేస్తాయి. ఈ మేరకు హిందూస్థాన్ టైమ్స్ ఓ కథనం వెలువరించింది.

ఇంటికి ఓ ప్రత్యేక సువాసన: ముందుగా ఇంటి మొత్తానికి ఒక సిగ్నేచర్ సువాసనను ఎంచుకోవాలి. నిమ్మగడ్డి (లెమన్‌గ్రాస్), మల్లెపువ్వు, వెదురు వంటి ప్రకృతికి దగ్గరగా ఉండే సువాసనలు ప్రశాంతమైన అనుభూతినిస్తాయి. ఇంట్లోని అన్ని గదుల్లో ఒకే రకమైన ఫ్రాగ్రెన్స్ విభాగానికి చెందినవి వాడితే, అడుగుపెట్టగానే ఓ ప్రత్యేకమైన ఆహ్వానం పలికినట్టు ఉంటుంది.

గదికో సువాసన: ప్రతి గదికి దాని వినియోగాన్ని బట్టి వేర్వేరు సువాసనలు కూడా వినియోగించవచ్చు. వంటగది, హోమ్ ఆఫీస్‌లో ఉత్సాహాన్నిచ్చే నిమ్మ వంటి ఫ్రెష్ సువాసనలు, లివింగ్ రూమ్‌లో లావెండర్ లేదా ఓషన్ బ్రీజ్ వంటివి ఆహ్లాదకరంగా ఉంటాయి. పడకగదిలో విశ్రాంతినిచ్చే లావెండర్, చందనం వాడొచ్చు. బాత్రూమ్‌లకు మస్క్ వంటివి స్పా అనుభూతినిస్తాయి. ఇందుకోసం రీడ్ డిఫ్యూజర్లు, సెంటెడ్ క్యాండిల్స్, రూమ్ స్ప్రేలు వాడటం ఉత్తమం.

సున్నితంగా ఉండాలి: సువాసన ఎప్పుడూ ఘాటుగా ఉండకూడదు, సున్నితంగా గది మొత్తం వ్యాపించాలి. గాలి ప్రసరించే చోట డిఫ్యూజర్లు పెట్టడం వల్ల వాసన సహజంగా వ్యాపిస్తుంది. అలాగే వాతావరణానికి అనుగుణంగా సువాసనలు మార్చాలి. వేసవిలో చల్లదనాన్నిచ్చే సిట్రస్, చలికాలంలో వెచ్చదనాన్నిచ్చే వనిల్లా వంటివి ఎంచుకోవాలి.

ఈ సువాసనలను కేవలం పండగలకే పరిమితం చేయకుండా, రోజూవారీ జీవితంలో భాగం చేసుకోవాలి. పుస్తకం చదివేటప్పుడు క్యాండిల్ వెలిగించడం లేదా రోజంతా ఇంట్లో ఆహ్లాదకరమైన వాసన ఉండటం వల్ల మనసుకు హాయిగా ఉంటుంది. సరైన సువాసనను ఎంచుకోవడం ద్వారా మన ఇంటిని మరింత ప్రశాంతంగా, విలాసవంతంగా మార్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Advertisement
Advertisement
Kiran V Ranga
Home Fragrance Tips
Luxury Resort Scent
Iris Home Fragrances
Room Freshener Ideas
Interior Scenting Guide

More Telugu News